హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా సోమవారం 211 నామినేషన్లు నమోదయ్యాయి. వివిధ నియోజకవర్గాల నుంచి అధికార బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లుగా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, ధర్మపురి, నిజామాబాద్ రూరల్, రామగుండం, చొప్పదండి, వేములవాడ, మెదక్, నర్సాపూర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, చేవెళ్ల, జూబ్లీహిల్స్, చార్మినార్, నారాయణ పేట, మక్తల్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్, షాద్నగర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు.