సిటీబ్యూరో, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టాయి. దీంతో రాత్రి, ఉదయం సమయంలో చలి తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17.2డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.8డిగ్రీలు, గాలిలో తేమ 45శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.