హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): డెవలపర్ ఆలస్యం వల్ల నివాస గృహం రిజిస్ట్రేషన్ పూర్తికాలేదన్న కారణంతో ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపును నిరాకరించడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
మూలధన లాభాలను కొత్త గృహ నిర్మాణంలో పెట్టుబడి పెట్టిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ చట్టంలోని సెక్షన్ 54ఎఫ్‌ను ఉదారంగా వర్తింపజేయాలని సూచించింది. పిటిషనర్‌కు సెక్షన్ 54ఎఫ్ ప్రయోజనం కల్పించాలని ఐటీ శాఖను ఆదేశించింది.