బెల్లంపల్లి, ఫిబ్రవరి 11 : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ఓటు వేసిన మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేశ్ బ్యాలెట్ పేపర్‌ను వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. బెల్లంపల్లి బస్తీకి చెందిన రెబల్ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ముల జయ కుమారుడు సురేశ్ ఓటు వేశాడు. ఆ బ్యాలెట్ పేపర్‌ను మొబైల్‌తో ఫొటో తీసి స్టేటస్‌గా పెట్టుకున్నాడు. పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్‌తో ఎలా తీసుకెళ్లాడన్నదానిపై చర్చ నడుస్తున్నది. పోలింగ్ బూత్ అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సురేశ్‌పై విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమండ్ చేస్తున్నారు.