శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11: గోపన్‌పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (బీటీన్జీవోస్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం బుధవారంతో 211వ రోజుకు చేరుకుంది. బీటీఎన్జీవోలకు చెందిన భూములను ప్రభుత్వం తిరిగి అప్పగించాలని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి తమ భూములను కాపాడి తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువురు బీటీఎన్జీవో ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్, సెక్రెటరీ మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రావు, కోశాధికారి ఎ.శ్రీనివాస్, డైరెక్టర్లు రషీదాబేగం, సంధ్యారాణి, అమరజ్యోతి, ప్రభాకర్‌రెడ్డి, దామోదర్, కెశియా నాయక్, శ్రీధర్, ఎం.శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.