హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం తెల్లవారుజామునే నంది నగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తనతోపాటు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై, ప్రభుత్వం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి ఒక లేక ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తామంటే తమ ఇంటి ముందు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారని మండిపడ్డారు. తమను నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిదని హితవు పలికారు. ఎన్ని రకాల కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటామని, ఇలాంటి పోలీసు నిర్బంధాలు తముకు, బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని స్పష్టం చేశారు.
All I wanted to do is board an RTC bus peacefully, travel to RTC MD office & submit a letter demanding roll back of steep hike in Bus ticket fares
Look at the number of police officers deployed right now outside my housing complex!!
All to prevent one person from boarding a Bus… pic.twitter.com/x2lRruoZ4T
— KTR (@KTRBRS) October 9, 2025