IT Tower | మహబూబ్‌నగర్ : ఒక్క హైదరాబాద్‌కే ఐటీని పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ టవర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు.
దివిటిపల్లిలో నాలుగు ఎకరాల్లో ఐదు అంతస్తుల్లో రూ. 40 కోట్ల వ్యయంతో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ఇప్పటికే ఈ ఐటీ టవర్‌లో పలు కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. శనివారం మంత్రి కేటీఆర్ ఐటీ టవర్‌ను ప్రారంభించగానే ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఐటీ టవర్ నిర్మాణానికి 2018, జులై నెలలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
Have a glimpse of the prestigious Mahabubnagar IT Tower built at Divitipalli.
Hon’ble Minister Sri @KTRBRS Garu will inaugurate the IT Tower on May 6. #ManaMahabubnagar #MahabubnagarITTower pic.twitter.com/bYi06czyT2
— V Srinivas Goud (@VSrinivasGoud) May 5, 2023