తొర్రూరు, డిసెంబర్ 7 : కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు తండా, ఎస్వీకే తండా తదితర గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంతరం దయాకర్రావు మాట్లాడుతూ.. సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలను చేసిందని, సర్కార్ నిర్లక్ష్యం వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడిందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు.