మంచిర్యాల, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా డైవర్షన్ డ్రామాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం మంచిర్యా ల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి, జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో ‘అప్పుడే మం చిగుండె’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆయాచోట్ల ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ పాలనపై స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. కాంగ్రెస్ హామీలు అమలవుతున్నాయా? అని అడిగి తెలుసుకోగా, సబ్బండవర్గాలు ప్రభు త్వ వైఫల్యాలపై మండిపడ్డాయి.