అలంపూర్, జనవరి 23 : రేవంత్ సర్కారు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, గ్రామసభల పేరుతో మరోసారి దగా చేయాలని యత్నిస్తున్నదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం గద్వాల జిల్లా అలంపూర్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలను మోసం చేయడమే సిద్ధాంతంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుష్టపాలన సాగుతున్నదని, రాబో యే ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు గ్రామ సభల వేదికలపై కూర్చోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని జనగణన చేసి, ఇప్పుడేమో గ్రామసభలు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని దుయ్యబట్టారు.