గోదావరిఖని, డిసెంబర్ 27 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఆలిండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఏఐటీయూసీ) జయకేతనం ఎగురువేసింది. 11 డివిజన్లలో 5 చోట్ల ప్రాతినిధ్య సంఘంగా గెలిచినా.. అత్యధిక ఓట్లతో గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ఆరు చోట్ల ప్రాతినిధ్య సంఘంగా గెలిచినా.. గుర్తింపు సంఘంగా గెలువలేకపోయింది. రామగుండం-1, ఆర్జీ-2, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ, ఆర్జీ-3, భూపాల్పల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్లో ఐఎన్టీయూసీ గెలిచింది.