హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ బడులను తగ్గిస్తే తిరుగుబాటు తప్పదని ఏఐఎస్ఎఫ్ హెచ్చరించింది. 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విద్యారంగ బలోపేత విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడులను కుదించే ఆలోచనను విరమించుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రవి మాట్లాడుతూ.. జూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, ఫిట్మెంట్ ప్రకటించకపోతే జూలైలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎస్సీ అభివృద్ధిశాఖ పరిధిలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అవుట్ సోర్సింగ్, యాక్టివిటీ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు సుదీర్ఘకాలంగా వేతనాలను చెల్లించడం లేదని, తక్షణం బకాయిలను చెల్లించాలని అవుట్ సోర్సింగ్ వరర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. కార్మికులకు 14నెలలుగా జీతాలు చెల్లించడం లేదని పేర్కొంది.