హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని, వెంటనే పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయూ భూముల విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.