హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు, సహాయ ఆచార్యుల నియామకాల నిబంధనల మార్పు కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై ఏఐఎస్ఎఫ్ మండిపడింది. ఉన్నత విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్ర తిపాదనలు ఉన్నాయని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఓ ప్రకటనలో విమర్శించారు. ఆర్ఎస్ఎస్ అనుకూల విధానాలు ప్రవేశపెట్టేందుకే వీసీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల అర్హతలో సడలింపులు ఇచ్చారని ఆరోపించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా పరిశ్ర మ, ప్రభుత్వ రంగాలకు చెందిన ని పుణులను వీసీలుగా నియమించవచ్చని చెప్పడం దారుణమన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసు మేరకు గవర్నర్లు వీసీలను నియమిస్తుండగా, కొత్త నిబంధనల ప్రకారం ఆ ఆధికారాన్ని కేంద్రం తీసుకుంటు ందని, తక్షణమే ప్రతిపాదనలు వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.