మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాల్య వివాహాలు బాగా తగ్గాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన పై జిల్లా ఐసీడీఎస్ అధ్వర్యంలో తొర్రూరులో నిర్వహించిన సదస్సును మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే గర్భవతులు కావడంతో ప్రసూతి మరణాలు , శిశు మరణాలు అధిక శాతంలో సంభవిస్తాయన్నారు. రక్త హీనత ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
బాల్య వివాహాల కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
బాల్య వివహాలు చట్టరీత్యా నేరం అన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం తెలిస్తే ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.