ACB Raids | వరంగల్ : వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏఈ కార్తీక్ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
కాంట్రాక్ట్ బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వర్ధన్నపేట మండలం కడారిగూడెకు చెందిన మాజీ సర్పంచ్ సతీశ్‌ను ఏఈ కార్తీక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మాజీ సర్పంచ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఈ కార్తీక్ మాజీ సర్పంచ్ నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏఈని అధికారులు విచారించి కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై స్పందించిన సర్కార్.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలి.. ఎమ్మెల్సీ వాణీదేవి సూచన