ఏసీబీ దాడులు చేసి ఎంతో మంది అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నా రాష్ట్రంలో అవినీతికి మాత్రం తెరపడటంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది.
పోలీసుశాఖకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లి శివారు మామిడి తోట లో గత నెలలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.23 వేల నగ�