కల్వకుర్తి, జూన్ 25 : కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో రెం డో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాంచందర్‌జీ బుధవారం రాత్రి ఏసీబీకి చిక్కాడు. బాధితుడు నంబి వెం కటయ్య నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ వివాదాలలో భాగంగా స్టేషన్ బెయిల్ కోసం బాధితుడు వెంకటయ్య నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీ బీ మహబూబ్‌నగర్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామానికి చెందిన నంబి వెంకటయ్యకు అతని దాయాదులకు భూ వివాదంలో గొడ వ జరిగింది.
కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో వెంకటయ్యపై కేసు(క్రైం నెంబర్ (220/2025)నమోదైంది. ఇం దుకు సంబంధించి స్టేషన్ బెయి ల్ కోసం రెండో ఎస్సై రూ.10 వేలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితు డు వెంకటయ్య తమను సంప్రదించినట్లు డీఎస్పీ చెప్పారు. దీంతో తాము నిఘా ఉంచామని, బాధితు డు వెంకటయ్య నుం చి రెండో ఎస్సై డ బ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నామని డీ ఎస్పీ వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు, దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని, గురువారం రెండో ఎస్సై రాంచందర్జీని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసులతో విసిగివేసారి ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు వెంకటయ్య చెప్పారు. దాయాదులతో భూమి పంచాయితీ జరిగింది. గొడవైంది, ఇరువర్గాలకు చెందిన తాము పోలీసులకు ఫిర్యాదు చేశాం. నేను ఇచ్చిన పిటిషన్ తీసుకున్నా కేసు చేయలేదు. నా ప్రత్యర్థి ఇచ్చిన పిటిషన్ తీసుకుని నాపై కేసు నమోదు చేశారు. నాకు అన్యా యం జరిగిందని నాయకుల చుట్టు తిరిగినా ఫలితం కనిపించలేదు. కనీసం బెయిల్ అన్నా ఇవ్వండని అడిగితే రూ.10 వేలు డి మాండ్ చేశారు.