రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. విద్యార్థులు అర్ధాంతంగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం శోచనీయమని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని సురభివాణీ దేవి అన్నారు. అలాంటి గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకీ దిగజారడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.