హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులు విద్యార్థులు లేక విలవిల్లాడుతున్నాయి. సాక్షాత్తు విద్యాశాఖ వెల్లడించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 78శాతం స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య 100లోపు మాత్రమే. రాష్ట్రంలో 22,522 ప్రభుత్వ పాఠశాలలుంటే, వీటిలో 17,639స్కూళ్లలో(78శాతం) విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నది. వీటిలో 15,770 ప్రాథమిక బడులే ఉండటం గమనార్హం. ఇటీవల టీచర్స్డే వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. లక్షల్లో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని చెప్పారు. కానీ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
హైస్కూళ్లు-విద్యార్థుల పరిస్థితి..