ఎరువుల కరువు లేదంటూ ఏలికలు పదే పదే చెప్తున్నా .. పల్లెల్లో పొద్దంతా కనిపిస్తున్న క్యూలు నిజమేంటో తేటతెల్లం చేస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్ అర్బన్ ప్రాథమిక సహకార సంఘం వద్ద కనిపించిన దృశ్యమిది.
ఉదయం నుంచి పడిగాపులు కాసినా సరిపడా యూరియా అందలేదని రైతులు వాపోయారు. ప్రైవేటుకు వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారని వారు వాపోయారు.