ఆదిలాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మున్సూర్ఖాన్ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. గిఫ్ట్ డీడ్ చేసేందుకు సబ్ రిజస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ.10 వేలు డిమాండ్ చేయగా రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. శుక్రవారం బాధితుడి నుంచి సబ్ రిజస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.