Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైన్నట్టు తెలిపింది. ఎండల తీవ్రత దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసినట్టు ఐఎండీ అధికారులు తెలిపారు.