మరణించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. 58 మంది పిల్లలకు రూ.14.87 లక్షల స్కాలర్షిప్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఇన్ఛార్జి వెల్ఫేర్ అడిషనల్ డీజీపీ అభిలాష బిష్త్ అందజేశారు.
చనిపోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాల్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘పరివర్తన్’ పేరుతో స్కాలర్షిప్లను అందజేస్తుంది. గత మూడేండ్లలో 151 మందికి పరివర్తన్ స్కాలర్షిప్లను పంపిణీ చేసింది. తాజాగా మరో 58 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందజేసింది. ఈ కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భాటియా, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రావు, వెల్ఫేర్ లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.