పరిగి, నవంబర్ 14: లగచర్లలో దాడి ఘటన, కేసు నమోదుతోపాటు అరెస్టులు, తదుపరి చర్యలపై అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పరిగిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. సుమారు 4 గంటలకు పైగా ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డితో ఆయన సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, అధికారులపై జరిగిన దాడి, ఇతర వివరాలను తెలుసుకున్నట్టు సమాచారం. కేసు నమోదు తర్వాత అరెస్టులు, తదుపరి చర్యలపై చర్చించినట్టు
తెలిసింది.