నాంపల్లి కోర్టులు, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను నాం పల్లి కోర్టు తిరస్కరించింది. ఈ మేర కు 1వ సెషన్స్ జడ్జి రమాకాంత్ బుధవారం తీర్పు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూ రు చేయరాదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) చేసిన వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు ఆరవ నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్ కు మార్ను అదుపులోకి తీసుకునేందు కు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరో నిందితుడైన ఎస్ఐబీ మాజీ అధికారి రాధాకిషన్‌రావు తన తల్లి కర్మకాండలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్‌పై కొనసాగుతున్నారు.