నాంపల్లి కోర్టులు, అగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న అదనపు ఎస్పీ భుజంగరావుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది.
ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 31 వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లిలోని 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.25 వేల చొప్పున ఇద్దరి జమానత్‌లను కోర్టుకు సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్‌ను వీడరాదని, బెయిల్ గడువు ముగియగానే కోర్టు ఎదుట హాజరు కావాలని భుజంగరావుకు స్పష్టం చేశారు.