ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు రచ్చకెక్కాయి. ఆ పార్టీల చేరికలు వర్గపోరుకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ(Congress) నుంచి బహిష్కరించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిత్ ఖాన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవరెడ్డిలను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాగా, వీరి చేరికలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు(Congress Activists) ఆందోళన బాటపట్టాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి కారణమైన ముగ్గురు నాయకులను చేర్చుకోవద్దంటూ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ధర్నా(Dharna) చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహులను పార్టీ నుంచి బహిష్కరించాలని నినదించారు. వారి చేరికలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ నిర్ణయం మార్చుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.