హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ డిమాండ్‌చేశారు. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్ట్రార్పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శనివారం లేఖ రాశారు. జీవో ప్రకారం ఇచ్చిన చిరునామాలో కాకుండా నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఒకే భవనంలో 2 నుంచి 6 ఇన్స్టిట్యూషన్స్ నిర్వహిస్తున్నారని, భవనాలు, ఫ్యాకల్టీ, మౌలిక వసతులపై దృష్టి సారించకపోవడంతో వ్యవస్థ భ్రష్ఠుపట్టిందని ఆందోళన వ్యక్తంచేశారు. వీరితోపాటు నర్సింగ్ కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్‌పై విచారణ చేపట్టాలని లేఖలో డిమాండ్‌చేశారు.