స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 2 : స్పీకర్ రాజ్యాంగానికి లోబడి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కోరారు. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒకవేళ 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టు ధికారం కిందికి వస్తుందని పేర్కొన్నారు. అకడ రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటే, ఇకడ రాజ్యాంగానికి విరుద్ధంగా సీఎం ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలని, ఈ విషయంలో ముందుగా తాను కొడతానంటూ పలికిన మాటలు సీఎం రేవంత్‌రెడ్డికి గుర్తుండకపోవడం విచారకరమని అన్నారు. కడియం శ్రీహరి తనతోపాటు మరో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు, తాను మంత్రిని అవుతానని పగటి కలలు కన్నాడని ఎద్దేవా చేశారు.