హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని దూషించిన ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) అబారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరింది. సోమవారం అంబేదర్ సచివాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లిని జేఏసీ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. 30 ఏండ్లుగా నిషళంకంగా సేవలందిస్తున్న సోమిరెడ్డిపై కమిషనర్ వ్యవహరించిన తీరు బాధాకరమని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ పేర్కొన్నారు. తోటి అధికారుల ముందు అసభ్య పదజాలంతో దూషించడం వల్ల సదరు అధికారి మానసిక ఒత్తిడికి లోనై దవాఖాన పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.