నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జైలు అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. రాధాకిషన్‌రావుకు హైకోర్టు ఇచ్చిన 4 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో శనివారం కోర్టు ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసిన కోర్టు ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించింది. అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. భుజంగరావు మధ్యంతర బెయిల్ సోమవారం ముగియడంతో గడువు పొడిగించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్‌రావు, ఐ-న్యూస్ ప్రతినిధి శ్రావణ్‌కుమార్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.