హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జీవో నంబర్ 252 ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. ఈ మేరకు బు ధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించామని చెప్పారు. ipr.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 9 నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నట్టు చెప్పారు.