బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 12:10:19

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే దాసరి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి : గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్దపల్లి మండలం లోని అన్ని గ్రామాల సర్పంచ్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణం, ప్రకృతి వనాల ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ధి పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. 

ప్రజలకు జవాబుదారీతనంగా పని చేసి వారి మన్ననలను చూరగొనాలన్నారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల దృష్టి సారించాలని, అధికారులతో సమన్వయంగా పనిచేసి  సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్ తోపాటు మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.


logo