ములుగు, మే 6 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాపరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేరెళ్లపల్లి వెంకటేశ్వ ర్లు అనారోగ్యంతో 2023, 2024 లో మెడికల్ లీవ్ తీసుకున్నాడు. 2025 జనవరి నుంచి విధులకు హాజరవుతున్నాడు. మెడికల్ లీవ్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించాలని దరఖాస్తు చేసుకున్నాడు.
సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌ మ్యారెడ్డి రూ.3,50,424 బిల్లును తయారు చేసి, ట్రెజరీకి పంపించాలంటే రూ.60వేలు ఇవ్వాలని డి మాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రూ.25 వేలను మంగళవారం వెంకటేశ్వర్లు అధికారులకు అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు.