మేడ్చల్, అక్టోబరు 7: లంచం తీసుకుంటున్న ఏఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సికింద్రాబాద్‌లో నివాసం ఉండే శర్మ మేడ్చల్ మండలం గౌడెవల్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణామ్లో ఇల్లు నిర్మించారు. ఇంటీరియర్ పనుల కోసం సరూర్‌నగర్‌కు చెందిన విశ్వనాథ్‌తో రూ.8 లక్షల చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. విశ్వనాథ్‌కు రూ.4 లక్షలను ముందుగా చెల్లించారు. కొన్ని రోజులు పనిచేసిన తర్వాత మరికొంత డబ్బు కావాలని విశ్వనాథ్ కోరాడు. ఇందుకు శర్మ నిరాకరించారు. దీంతో పని ఆగిపోయింది. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగడంతో శర్మ మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. ఈ కేసులో జోక్యం చేసుకున్న ఏఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.