దుండిగల్, మార్చి 27: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల విద్యుత్తు సబ్‌డివిజన్ పరిధిలోని డీ పోచంపల్లి సబ్‌స్టేషన్‌లో ఏఈగా ఎస్ సురేందర్‌రెడ్డి పనిచేస్తున్నాడు. ఈక్రమంలో బౌరంపేటకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి 11కేవీ విద్యుత్తు లైన్స్థానంలో కేబుల్ వైర్ వేయాలని సురేందర్‌రెడ్డిని సంప్రదించాడు. దీనికి సురేందర్‌రెడ్డి రూ. 30 వేలు డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు.. గురువారం సురేందర్‌రెడ్డికి రూ.30 వేలు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సురేందర్‌రెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ దాడుల్లో సిటీ రేంజ్ యూనిట్-2 ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేస్తే 1064కి సమాచారం అందించాలని సూచించారు.