వరంగల్ : వరంగల్( Warangal ) సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ ( ACB ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు( Surprise Inspections) నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, డాక్యుమెంట్లు ఇద్దరు సబ్ రిజిస్ట్రర్ల నుంచి స్వాదీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రర్-1 జమాలపురం రామనరసింహరావు, సబ్ రిజిస్ట్రర్-2 దేవులూరి ఆనంద్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

ఇద్దరు అధికారులు డాక్యుమెంట్ రైటర్లతో జరిపిన ఫోన్ పే పరిశీలించగా సుమారు రూ.42 లక్షలు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 70 రిజిస్ట్రేషన్ కాని డాక్యుమెంట్లను పరివీలించారు. అదే విధంగా ఇద్దరు ఇళ్ల నుంచి రూ.24.61 లక్షల నగదును, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలను, 2.600 కిలో గ్రాముల వెండి ఆభరణాలను, రూ.30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.
