KTR | హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్, యాక్టర్ బండ్ల గణేష్ కూతురు జనని వివాహం సూర్యతేజతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సంప్రదాయబద్ధంగా వేదమంత్రాల నడుమ వైభవంగా జరుగుతున్నజనని, సూర్యతేజ వెడ్డింగ్ ఈవెంట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురు నేతలున్నారు.