చిట్యాల, అక్టోబర్ 9: మ్యుటేషన్ నివేదిక ఇచ్చేందుకు ఓ తహసీల్దార్ రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం చోటుచేసుకున్నది. మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ ఇన్చార్జి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 172లోని వ్యవసాయ భూమి మ్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేసి నివేదికను చిట్యాల ఎస్సైకి సమర్పించడానికి తహసీల్దార్ గుగులోతు కృష్ణ నాయక్ ఓ వ్యక్తిని రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశాడు.
అడ్వాన్స్‌గా రూ.2 లక్షలను గురువారం ఆన్లైన్ వర్క్ చేసే రమేశ్ అనే వ్యక్తి ద్వారా తీసుకున్నాడు. రమేశ్ ఆ డబ్బులను ఆఫీస్‌లోని బీరువాలో భద్రపర్చిన అనంతరం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.