TGSRTC | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే వారికి జీరో టికెట్ జారీ చేసి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే చాలా ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు అప్డేట్ చేయించిన ఆధార్ చూపిస్తేనే జీరో టికెట్లు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను ప్రశ్నించారు. తెలంగాణాలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటే చాలా..? ఖచ్చితంగా అప్డేట్ ఆధార్ కావాలా..? దయచేసి నిర్ధారించండి అని సజ్జనార్‌ను సదరు ప్రయాణికుడు కోరారు.
దీనిపై ఎండీ సజ్జనార్ స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, తదితర గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించి జీరో టికెట్లను తీసుకోవచ్చు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత రవాణా సదుపాయం స్కీమ్ అమలుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదు అని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Plz @TSRTC తెలంగాణాలో మహాలక్ష్మి పథకంలో బాగంగా మహిళలకు ‘0’ టికెట్ కోసం ఆధార్ ఉంటే చాల..? ఖచ్చితంగా అప్డేట్ ఆధార్ కావాలా..?
Plz Conform @SajjanarVC Sir
— Mudavath Ramesh Nayak (@RameshMudavath5) May 8, 2025