హైదరాబాద్ : నల్లగొండ(Nallgonda) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు(Fishing) వెళ్లి ఓ యువకుడు మరణించగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన చందనపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందనపల్లి చెరువులో(Pond) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.