హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం అసెంబ్లీలో నిరసన వ్యక్తంచేశారు. ఒక్కరోజు మాత్రమే ప్రశ్నోత్తరాలను నిర్వహించి, మిగతా రోజులు రద్దుచేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గత 15 నెలల్లో సభ్యులు అడిన ప్రశ్నలకు 15 రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానాలు పంపించాలని సీఎస్, సహా ఇతర అధికారులకు ఆదేశించినట్టు సభకు వివరించారు.