ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హైవే రోడ్డు(National Highway) పక్కన చెట్లకు నీళ్లు పోస్తున్న కార్మికుడిని లారీ(Lorry) ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి(Worker died) చెందాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా దూద్గండి వద్ద చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.