Mahabubnagar | మహబూబ్‌నగర్ : వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం మండిపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు రైతు సభలు నిర్వహిస్తున్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో ఓబులాయపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు సభ నిర్వహించారు. ఈ రైతు వేదిక సాక్షిగా ఓ వృద్ధురాలు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. రేవంత్..! జాగ్రత్త..! రైతుల జోలికి వస్తే బడితె పూజ తప్పదు. 3 గంటల కరెంటంటే ఈ కర్రతో కొడుతా బిడ్డా అని రేవంత్ రెడ్డిని వృద్ధురాలు దేవమ్మ హెచ్చరించింది. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోదని వృద్ధురాలు తేల్చిచెప్పింది. 3 గంటల కరెంట్ సరిపోతదన్న కాంగ్రెసోళ్లకు ఓటేయం అని చెప్పింది. అన్నదాతలను అవమానించిన కాంగ్రెస్ మాకొద్దు.. బీఆర్ఎస్కే ఓటేస్తాం అని దేవమ్మ స్పష్టం చేసింది.
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఓ వృద్ధురాలు మండిపడింది. ఇంకోసారి 3 గంటల కరెంటంటే ఈ కర్రతో రేవంత్‌ను కొడుతా అని హెచ్చరించింది వృద్ధురాలు దేవమ్మ. అన్నదాతలను అవమానించిన కాంగ్రెస్ మాకొద్దు.. బీఆర్ఎస్కే ఓటేస్తాం.. @VSrinivasGoud pic.twitter.com/PStiav6KYQ
— Namasthe Telangana (@ntdailyonline) July 17, 2023