ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపురం గ్రామ సమీపంలోని తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలో కోరం మంగమ్మ(35) అనుమానాస్పదంగా(Suspicious condition) గురువారం మృతి(Woman died) చెందింది. ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త మంగయ్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఇంటి పక్కనే ఉన్న కమలతో మంగమ్మ బుధవారం గొడవపెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన కమల వెదురు కర్రలతో మంగమ్మను విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర అస్వస్థకు గురై ఇంట్లోనే నిద్రించింది.
ఉదయం లేచిన మంగమ్మ సృహతప్పి కిందపడిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. కమలతో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి తన తల్లి మృతి చెందిందని కుమారుడు మహేశ్ తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి గూడేనికి వెళ్లి మంగమ్మ మృతదేహానికి పంచనామా నిర్వహించి ములుగు హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కమలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.