ఖమ్మం : వైద్యం వికటించి ఓ మహిళ మృతి(Woman died) చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలో (Khammam) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కుర్యావుల సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరింది. అయితే ఆపరేషన్ ఫెయిల్(Operation failure) అయి సైదమ్మ మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని దీంతో మృతురాలి బంధువులు హాస్పిటల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్య చికిత్స కోసం కుర్యావుల సైదమ్మ అనే మహిళను తరలించగా ఆపరేషన్ ఫెయిల్ అయి మృతిచెందింది.
దీంతో మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు… pic.twitter.com/s7Vz14r6cU
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2024