Peddapalli | పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తులు, తల్వార్లతో రెచ్చిపోయాడు. కంప్యూటర్ ల్యాబ్‌లో పని చేస్తున్న ఉద్యోగిపై కత్తి, తల్వార్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. విద్యార్థులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. భయంతో విద్యార్థులు పరుగులు పెట్టారు.
రక్తపు మడుగులో పడి ఉన్న ఉద్యోగిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని శ్రీనివాస్‌గా గుర్తించారు. శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Leopard | దిలావర్పూర్లో చిరుత సంచారం.. భయాందోళనల్లో ప్రజలు