ఖమ్మం రూరల్ : రోడ్డు ప్రమాదంలో(Road accident )ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాయిడుపేట బైపాస్ రోడ్డు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న పాముల కేశవులు అనే ద్విచక్ర వాహనదారుడిని ఖమ్మం నుంచి నాయుడు పేట వైపుగా వస్తున్న ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది.
దింతో తీవ్ర గాయాలపాలైన కేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యాశాల మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.