Srisailam | శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆదిదంపతుల దర్శనాల కోసం వివిధప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మరాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు జరిపే నిత్య ఆర్జిత సేవలు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా శీఘ్ర, అతిశీఘ్ర, విరామ దర్శనాలకు గంట సమయం
పడుతుందని ఆలయ పర్యవేక్షకులు తెలిపారు.
స్వామిఅమ్మవార్లకు సహస్త్రదీపార్చన – వెండి రథోత్సవము
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్నపురాతన దీపాలంకరణ మండపంలో ఈవో ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేదపండితులు మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకిసేవ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లు బదిలీ..
ANR National Award 2024 | ఏఎన్నార్ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి
Free Gas Cylinder | ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు